స్వల్ప ఛేదనలో సన్‌రైజర్స్‌ మరోసారి ఓటమి..

170
Mumbai
- Advertisement -

ముంబై ఇండియన్స్‌ బౌలర్లు మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచారు. హైద్రబాద్‌ సన్‌రైజర్స్‌ను 151 పరుగులను కూడా చేయనీయకుండా దెబ్బతీశారు. దీంతో ముంబై 13 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆపై 151 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 19.4 ఓవర్లలోనే ఆలౌట్ అయింది.
రాహుల్ చాహార్ 3 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీసి తమ జట్టు విజయానికి బాటలు వేశారు.

బెయిర్ స్టో 22 బంతుల్లో 43 పరుగులు, కెప్టెన్ వార్నర్ 34 బంతుల్లో 36, విజయ్ శంకర్ 25 బంతుల్లో 28 పరుగులు చేశారు. మనీశ్ పాండే 2, విరాట్ సింగ్ 11, శంకర్ 28, అభిషేక్ 7, రషీద్ ఖాన్ 0, భువనేశ్వర్ 1, ఖలీల్ అహ్మద్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. సన్ రైజర్స్ చివరి 7 వికెట్లూ 36 పరుగుల తేడాలోనే కోల్పోవడం గమనార్హం.

ఇక నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మధ్యాహ్నం మ్యాచ్ జరుగనుండగా, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 6.30 నుంచి మ్యాచ్ జరుగనుంది.

- Advertisement -