యంగ్‌ టైగర్‌తో ఉప్పెన డైరెక్టర్‌ మూవీ..!

124
NTR
- Advertisement -

నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ ఇటీవల విడుదలై వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతిక శెట్టిలకు ఆర్టిస్టులుగా మంచిపేరు తెచ్చింది. బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించింది. సత్తా వున్న దర్శకుడిగా అతనికి ఘనమైన పేరును మోసుకొచ్చింది.

దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టి బుచ్చిబాబు మీద పడింది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించబోయో ప్రాజెక్ట్‌కే మళ్ళీ బుచ్చి బాబు కమిటయ్యాడని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు రెండవ సినిమా కూడా ఈ మేకర్స్‌తోనే చేయబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాని బుచ్చిబాబు స్టార్ హీరో చేయబోతున్నాడని స్వయంగా తనే వెల్లడించాడు.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు కథ సిద్దం చేస్తున్నాడు. హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే బుచ్చిబాబు ఈ స్టోరీ లైన్ ఎన్టీఆర్‌కి వినిపించాడని.. లైన్ నచ్చడంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. బుచ్చిబాబు ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్టును రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఇక తన రెండవ సినిమానే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం అదృష్టమని చెప్పుకుంటున్నారు సినీ విశ్లేషకులు.

- Advertisement -