బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 24 హైలైట్స్

31
lobo

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 24 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నటరాజ్ మాస్టర్ వింత ప్రవర్తన,లోబో దానిని చూసి కామెడీ చేయడం వంటి వాటితో ఎపిసోడ్ అలా సాగిపోయింది. తొలుత నటరాజ్ మాస్టర్ దగ్గరికి వచ్చిన రవి..హౌస్‌లో గుంటనక్క నేనే కదా అని అడగ్గా ఆ టైంలో అలా అనిపించింది అని తెలిపారు మాస్టర్. దీంతో ఒక్కసారి నువ్ గుంటనక్క కాదని చెప్పండి మాస్టర్…గుంటనక్క అనగానే అంతా తనవైపు చూస్తుంటే భరించలేకపోతున్నానని తెలిపాడు రవి.

మరోవైపు లోబో ప్రవర్తనపై ప్రియ ఎమోషనల్ అయ్యింది.. ఏడుస్తూ కనిపించింది. ఇంటి సభ్యులు ఆమెను ఓదార్చారు. ఇక కాజల్ తనని ఫిజికల్‌గా టచ్ చేయడం నచ్చలేదని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు రవి. అది మనసులో పెట్టుకుని కాజల్ బాధపడింది. ఇక నటరాజ్ మాస్టర్ అయితే.. ఇంట్లో ఉన్న వాళ్లందరికీ గుంటనక్క మాదిరే జంతువులు పేర్లు పెట్టి రవి, లోబోల ముందు నవ్వించే ప్రయత్నం చేశాడు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో పిచ్చెక్కినట్టు ప్రవర్తించిన లోబో.. ప్రియ దగ్గరకు వెళ్లి ఆమెను పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. శ్రీరామ్ అయితే తన అద్భుత గానంతో మరోసారి అలరించారు. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకి టాస్క్ ఇచ్చారు.

ఇంట్లో ఉన్న వాళ్లు ఇద్దరిద్దరు చొప్పున జంటలుగా విడిపోవాలని.. అలాగే వెయిట్ కూడా చూసుకోవాలని చెప్పారు. కాజల్-జెస్సీ, షణ్ముఖ్- సిరి, లోబో- నటరాజ్,రామ్ -హమీదా, శ్వేతా-ఆనీ మాస్టర్, ప్రియ- ప్రియాంక, రవి – విశ్వ, సన్నీ – మానస్ జంటలుగా విడిపోయారు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్ ఇచ్చారు.

ఈ టాస్క్‌లో అన్ని జంటల ఏకైక లక్ష్యం సాధ్యమైనంత బరువుని కోల్పోవడం. ఏ జంట అయితే అందరి కంటే ఎక్కువగా బరువుని కోల్పోతారో వాళ్లే కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని చెప్పారు. ఇక తర్వాత నటరాజ్ మాస్టర్ చిత్ర విచిత్రంగా ప్రవర్తించాడు.. తనలో తాను మాట్లాడుకుంటూ.. పెద్ద పెద్దగా నవ్వుకుంటూ.. మంచి బలం ఉన్న ఫిజికల్ టాస్క్ పెడితే నా వేట ఏంటో చూపిస్తా అని తనలో తాను మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. లోబో అయితే అతని పిచ్చి చేష్టలు చూసి బెంబేలెత్తిపోయాడు.

నటరాజ్ మాస్టర్‌తో జోడీ కట్టిన లోబో ఆకలికి ఆగలేక.. ప్రిజ్డ్‌లో పెట్టిన ఫుడ్‌ని సీక్రెట్‌గా లాగించేయడంతో హౌస్‌ కెప్టెన్ జెస్సీకి శిక్ష వేశాడు బిగ్ బాస్. అతనితో పాటు జెస్సీతో జోడీ కట్టిన కాజల్‌ కూడా కెప్టెన్సీ అనర్హత వేటుకి గురైంది.