డికాక్‌ మెరుపు హాఫ్ సెంచరీ …కోల్‌కతాపై ముంబై గెలుపు

236
mi
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘనవిజయం సాధించింది. 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 149 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో టోర్నమెంట్‌లో ఆరో విజయాన్ని నమోదుచేసింది ముంబై.

స్వల్ప లక్ష్యమే అయిన ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు ముంబై ఓపెనర్లు. ముఖ్యంగా డికాక్ ధాటిగా ఆడితే రోహిత్ అతడికి సహకారం అందించారు. 36 బంతుల్లో 35 పరుగులు చేసి రోహిత్ ఔటైనా డికాక్ తన జోరును కంటిన్యూ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి ఔటైనా ముంబై విజయం అప్పటికే దాదాపుగా ఖరారైపోయింది. ముఖ్యంగా డికాక్ ఏ మాత్రం ఛాన్స్ దొరికనా ఫోర్‌ లేదా సిక్స్‌ కొట్టి కోల్ కతా బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. చివరలో హార్దిక్ కూడా తనదైన శైలీలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడటంతో ముంబై విజయం ఖాయమైంది. డికాక్ 44 బంతుల్లో 3 సిక్స్‌లు,9 ఫోర్లతో 78 పరుగులు చేయగా హార్ధిక్ 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. పాట్‌ కమిన్స్‌(53 నాటౌట్:‌ 36 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) , కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(39 నాటౌట్‌: 29 బంతుల్లో 2ఫోర్లు,2సిక్సర్లు) రాణించడంతో కోల్ కతా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఓ దశలో 61/5తో పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది.రాహుల్‌ త్రిపాఠి(7), శుభ్‌మన్‌ గిల్‌(21), నితీశ్‌ రాణా(5), దినేశ్‌ కార్తీక్‌(4) దారుణంగా విఫలమయ్యారు.

- Advertisement -