బిగ్ బాస్ 4….ఎపిసోడ్ 41 హైలైట్స్‌

141
episode 41

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 41 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 41వ ఎపిసోడ్‌లో రేసర్ ఆఫ్‌ ది హౌస్ టాస్క్‌,ఇంట్లోని ఆడవాళ్లకు సపరేట్‌గా పార్టీ చేసుకునే ఛాన్స్ ఇవ్వడం,వారంతా మగసభ్యులతో ఆటాడుకోవడం వంటి టాస్క్‌లతో ఫన్నీగా ముగిసింది.

ఇక మార్నింగ్ వేకప్‌ సాంగ్‌లో భాగంగా బద్రినాథ్ సాంగ్‌కి ఇంటి సభ్యులు డాన్స్ వేస్తూ కనిపించగా యథాతథంగా మోనాల్‌ …అఖిల్‌ని హగ్ చేసుకుని ఉండిపోయింది. తర్వాత అరియానాతో దివి గురించి చర్చించిన అవినాష్‌….ఆమె సరిగా పనిచేయడం లేదని చెప్పుకొచ్చాడు. బాస్ కెమెరా కళ్లు కప్పి బెడ్ వెనుక ఉన్న ప్లేస్‌లో పడుకున్నాడు సొహైల్‌. ఎవరైన నిద్రపోతే కుక్కలు అదే పనిగా మొరుగుతుండటంతో కెప్టెన్‌గా ఉన్న నోయల్‌ అలా చేయొద్దు అని తెలిపాడు. ఈ క్రమంలో నోయల్- కుమార్ సాయి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

ఈ టాస్క్‌లో టైర్ల మధ్య నుంచి నడవడం,ఇసుక బస్తాలతో స్మిమ్మింగ్ ఫూల్‌ దాటడం, తడి చేతులతో వేలాడుతూ నడవడం లాంటి కఠినమైన టాస్క్‌లు ఇచ్చారు. ఇక ఈ టాస్క్‌లో కుమార్ సాయి 1.5 సెకన్లు,అఖిల్ 1.11 సెకన్లు,అవినాష్ 1.18,సొహైల్ 1.00,మెహబూబ్ 49 సెకన్లలో టాస్క్ పూర్తి చేశారు. అందరి కంటే తక్కువ సెకన్లలో అన్ని టాస్క్‌లను కంప్లీట్ చేసిన మెహబూబ్ రేసర్ ఆఫ్ ది హౌస్‌గా నిలిచాడు.

తర్వాత మెహబూబ్‌ చేసిన పనిని తప్పుబడుతూ అఖిల్ తీవ్రంగా బాధపడి పోయాడు. పుష్ అప్ విషయంలో నేను 105 కొట్టానని మోనాల్ కౌంట్ చేసిందని.. కానీ మెహబూబ్ 105 కొట్టావా?? అని ఆశ్చర్యంగా ఆడగడం బాధించిందన్నారు. తర్వాత మెహబూబ్ సారీ చెప్పిన సొహైల్ సర్ది చెప్పే ప్రయత్నం చేసిన అఖిల్ వినిపించుకోలేదు.

ఇంట్లో ఉన్న అమ్మాయిలు అందరికీ నైట్ ఔట్ పార్టీ చేసుకునే అవకాశం ఇవ్వడంతో పొట్టి పొట్టి బట్టలతో రచ్చ చేశారు. తర్వాత ఒక్కొ అబ్బాయిని పిలిపించుకుని పొగిడించుకునే పని పెట్టారు. తొలుత వచ్చిన అభి…అందరిని ఇంప్రెస్ చేయగా సొహైల్ లుంగీ కట్టుకుని వచ్చి అలరించాడు. దివి, హారిక, అరియానాలకు పొగరు అదీ ఇదీ అనడంతో సొహైల్ లుంగీ లాగేందుకు తెగ ప్రయత్నం చేశారు. తర్వాత వచ్చిన అఖిల్‌తో ఆటాడుకోగా చివర్లో చివర్లో స్వింగ్ జరా సాంగ్ పాటకు అమ్మాయిలు, అబ్బాయిలు స్టెప్పులతో రచ్చ చేశారు. ఇక చివరగా అవినాష్‌తో కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేసింది మోనాల్‌. అవినాష్‌ని గట్టిగా కౌగిలించుకుని నీ ఫీలింగ్ ఏంటి అంటూ అడిగేయగా ఎపిసోడ్ ముగిసింది.