మొక్కలు నాటిన ములుగు DRO..

208
Mulugu DRO K Ramadevi

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ములుగు జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద ఆమె మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మూడు మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు రమాదేవి.

అనంతరం మరో ముగ్గురు డీఆర్డీవో ఏ. పారిజాతం, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారిణి పి. భాగ్యలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారిణి మల్లీశ్వరి లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని జిల్లా రెవిన్యూ అధికారిణి కోరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో జె. శ్యామ్ కుమార్ తదితరులు ఉన్నారు.