గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కంభంపాటి..

168
Green India Challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జెడి లక్ష్మీనారాయణ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన భద్రాచలం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కంభంపాటి సురేష్ కుమార్ మొక్కలు నాటారు. అలాగే ఆయన మరొక ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ విసిరారు. భద్రాచలం గ్రీన్ భద్రాద్రి మరియు మరొక రెండు అసోసియేషన్ లకి గ్రీన్ చాలెంజ్ విసిరారు . ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి మంచి కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని తన సంఘంలో ఉండే 1067 వర్తక వ్యాపారావేత్తలు భాగస్వామ్యం కావాలని కోరారు.