మొక్కలతోనే మానవాళి మనుగడ: ములుగు కలెక్టర్

399
Mulugu Collector
- Advertisement -

మొక్కలతో పర్యావరణ పరిరక్షణ తోపాటు, మానవాళి మనుగడ ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ తనకు ఛాలెంజ్ విసరగా, అట్టి ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటినట్లు కలెక్టర్ తెలిపారు.

ములుగు జిల్లా సమ్మక్క, సారాలమ్మ వన దేవతలకు ప్రసిద్ధి చెందిన జిల్లా అని ఇక్కడ చాలా అటవీ సంపద ఉందని అన్నారు. జిల్లాలో ఇంకా మొక్కలు నాటాలనే ఉద్దేశ్యంతో ఈ గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ సభ్యుల గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కలెక్టర్ ముగ్గురికి ఛాలెంజ్ విసిరి, వారు మొక్కలు నాటి, గ్రీన్ ఛాలెంజ్‌ను కొనసాగించాలని కోరారు.

కలెక్టర్ గ్రీన్ ఛాలెంజ్ విసిరిన వారిలో ములుగు జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ జీ పాటిల్, ఐటీడీఏ ఏటూరునాగారం పీవో హన్మంతు కె జండగే, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)ఆదర్శ్ సురభి వున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ పిఆర్వో పురుషోత్తం జిల్లా కలెక్టర్‌కు వన మిత్ర అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి ఎన్. వెంకయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -