ఓటీటీకి నో చెప్పిన హీరో రామ్‌..

211
ram

కిషోర్ తిరుమల దర్శకత్వంలో హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘రెడ్’ ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే గత కొంతకాలంగా కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్స్‌ ముతపడ్డాయి. ఈ నేపథ్యంలో చాల సినిమాలను ఓటీటీ ప్లేయర్స్ ద్వారా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు రామ్‌ నటించిన రెడ్‌ సినిమాకు కూడా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు అలోచిస్తున్నారట. ఈ చిత్రానికి ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయట.

అయితే, కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని రామ్ పట్టుపడుతుండడంతో నిర్మాత ఆ ఆఫర్లను తిరస్కరించినట్టు చెబుతున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఎలాగూ థియేటర్లు తెరుస్తారనీ, అంతవరకూ ఓపిక పట్టమనీ రామ్ చెప్పాడట. సంక్రాంతికి డైరెక్టుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని రామ్ నిర్మాతకు సూచించాడని తెలుస్తోంది. అయితే, నిర్మాతలు ఓటీటీ ద్వారా విడుదల చేసుకుని, బయటపడదామని ఆలోచిస్తున్నప్పటికీ బాగా ఇమేజ్ వున్న కొందరు హీరోలు మాత్రం ఈ ఓటీటీ విడుదల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.