కేసీఆర్, కేటీఆర్‌లకు ధన్యవాదాలు: క్రెడాయ్

247
kcr
- Advertisement -

బంజారాహిల్స్ లోని తమ కార్యాలయంలో కరోనా సమయంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి, టీఎస్ బిపాస్ లాంటి చట్టాలపై క్రెడాయి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ సభ్యులు మీడియాతో మాట్లాడారు.

క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తుంది. కొత్త మున్సిపల్, కొత్త రెవెన్యు, టీఎస్ బీపాస్ చట్టాలు తెలంగాణను మరో లెవెల్ కి తీసుకెళ్తాయన్నారు. ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్చుతోంది. బిల్డింగ్ పర్మిషన్ కి నెలలు పట్టేది. మంత్రి కేటీఆర్ టీఎస్ బీపాస్ లాంటి గొప్ప సంస్కరణ తీసుకొచ్చారు. టీఎస్ బీపాస్ తో అందరికి లాభం జరుగుతుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే 8 నుంచి 9 శాఖల ప్రమేయం ఉంటుంది. త్వరగా బిల్డింగ్ పర్మిషన్ వస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇలాంటి చట్టం తెచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ వచ్చాక రియల్ ఎస్టేట్ బిజినెస్ తగ్గింది. ప్రస్తుతం కరోనా ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై లేదు. హైదరాబాద్‌లో మార్కెట్ ప్రస్తుతం పాజిటివ్ గా ఉంది. అంతా సాధారణ పరిస్థితులు వచ్చేలా కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు అన్నారు. హైదరాబాద్‌ పెట్టుబడులకు కేంద్రం.పెద్ద ఎత్తున ఫార్మాసిటీస్ కూడా ఏర్పడుతున్నాయి. 3, 4 నెలల నుంచి మంత్రి కేటీఆర్ కృషితో వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం కామన్ మ్యాన్ కి ఎంతో ఉపయోగకరం అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. టీఎస్ బీపాస్ ఒక్క యాక్ట్ తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ లో తెలంగాణ దూసుకెళ్తది. ఎంతో అద్భుతమైన టీఎస్ బిపాస్ చట్టాన్ని తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చేలా తెలంగాణ పాలసీలు ఉన్నాయి.తెలంగాణ కు మంచి రోజులు వస్తున్నాయని పేర్కొన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ వేణు వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణలో రికార్డ్స్ ని డిజిటలైజేషన్ చేయడం ద్వారా అనేక సమస్యలు తొలిగి పోతాయి.లీగాలిటీ ఇంప్రూవ్ అవుతుంది.దేశంలో ఎక్కడైనా భూమి కొనాలంటే భయపడుతారు.రాష్ట్రంలో తెచ్చిన చట్టలతో లీగాలిటీ బాగుంటుంది. అద్భుతమైన సంస్కరణలు తెచ్చిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు క్రెడాయ్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ వేణు వినోద్.

- Advertisement -