ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైలుకెళ్లిన ములాయం..

88
- Advertisement -

యూపీ మాజీ సీఎం,సీనియర్ రాజకీయ నాయకులు ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆగస్టు 22న మేదాంత ఆస్పత్రిలో చేరిన ములాయం…పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశారు. 1939 నవంబరు 22న ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా జిల్లాలోని సైఫాయ్ గ్రామంలో జన్మించారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. లోహియా, రాజ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ములాయం.. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి యూపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

1977లో తొలిసారి మంత్రి అయ్యారు. 1980లో లోక్ దళ్ అధ్యక్షుడిగా పనిచేసిన ములాయం..1982లో యూపీ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. లోక్ దళ్ చీలిక తర్వాత క్రాంతికారీ పార్టీని ములాయం ప్రారంభించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 19 నెలల పాటు జైలుజీవితం గడిపారు.

- Advertisement -