ఆసక్తికరంగా ముఖచిత్రం..

84
mukhachitram
- Advertisement -

వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమూడి, చైతన్య రావ్, అయేషా ఖాన్, సునీల్ పలువురు నటించిన చిత్రం ‘ముఖచిత్రం’. ఎస్‌కేఎన్‌ సమర్పణలో ప్రదీప్‌ యాదవ్, మోహన్‌ యల్ల నిర్మించిన ఈ చిత్రానికి గంగాధర్‌ దర్శకుడు. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేశారు.

ట్రైలర్ ఫన్ టాక్ తో మొదలు అయ్యి మెల్ల మెల్లగా సీరియస్ నోడ్ లకు వెళ్తుంది. పెళ్లి చూపుల సన్నివేశం మొదలుకుని పెళ్లి ఫస్ట్ నైట్ ఇలా అన్ని సన్నివేశాలు కూడా ట్రైలర్ లో చూపించి.. ఆ తర్వాత హత్యకు సంబంధించిన షాట్స్ చూపించడంతో సినిమాపై ఇంట్రెస్ట్ పెంచారు.

నిర్మాణంలో మాకు అనుభవం లేకపోయినా మా టీమ్‌ అర్థం చేసుకుని సినిమాని పూర్తి చేశారు అన్నారు ప్రదీప్‌. టీజర్‌లో కొంతే చూపించాం. సినిమా ఇంతకు వంద రెట్లు ఆసక్తిగా ఉంటుందన్నారు. ఓ బలమైన అంశాన్ని ఎంచుకుని సందీప్‌ రాజ్‌ కథ రాశాడు. ఇది డిఫరెంట్‌ మూవీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

https://youtu.be/W1V7gwDKmfA

- Advertisement -