మేడారం జాతర ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష..

66
- Advertisement -

మేడారం జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డిలు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పోలీసు, రెవిన్యూ, గిరిజన, దేవాదాయ, వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయితీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా, విధ్యుత్, పశు సంవర్ధక శాఖ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, ఆర్టీసీ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనా మేడారం జాతర ఈ నెల 16వ తేదీ నుండి 19 వరకు జరుగుతుంది. ఈ సారి కూడా కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నాము. ఇవాళ జంపన్న వాగులోకి నీరు విడుదల చేసాం.దేవాదాయ, ఇంజనీరింగ్ విభాగాల పనులన్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలి. మేడారం పూజారులు, ట్రస్టు బోర్డు సభ్యులతో కలసి పనిచేయాలి అధికారులను ఆదేశించారు.

- Advertisement -