ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో రికార్డు సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-10లో స్థానం సంపాదించారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. ఆసియా నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అంబానీ చోటు సంపాదించుకున్నాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 9వ స్ధానంలో నిలిచాడు. అంబానీ యొక్క నికర సంపదను 64.5 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. జియో అందుబాటులోకి వచ్చినప్పనుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రెండింతలు పెరిగాయి.
కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంటే ముఖేశ్ అంబానీ మాత్రం 64.5 బిలియన్ డాలర్ల సంపదను పెంచుకోగలిగారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు మొత్తం ఇంట్లోనే ఉండటంతో ఆఫర్లతో జియో ఆకట్టుకుంది. దీంతో కరోనా టైంలో కూడా తన సంపదను అలాగే కాపాడుకుంటు వచ్చారు ముఖేశ్ అంబానీ. అన్ని రంగాలపై కరోనా దెబ్బ పడినా ముఖేశ్ అంబానీ మాత్రం తన సంపదను మరింత పెంచుకున్నారు.