విడుదలకు సిద్ధమైన ‘ముగ్గురు మొనగాళ్ళు’..

44

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ముగ్గురు మొనగాళ్లు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం. ఆగస్టు 6న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.

చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డికి వినపడదు.. దీక్షిత్ మాట్లాడలేదు.. రామారావుకి కనపడదు.. ఇలా ముగ్గురు మొనగాళ్లు సినిమా ఓ ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ తో సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో శ్రీనివాస్ రెడ్డి కామెంట్ హైలెట్‌గా నిలిచింది. టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.