బర్త్ డే…మొక్కలు నాటిన కృష్ణుడు

134
gic

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని తన పుట్టినరోజును పురస్కరించుకుని కొండాపూర్ లోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు సినీ నటుడు కృష్ణుడు.

ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటుతున్నాను…ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అన్నారు.

ఇందులో నేను భాగస్వామ్యం అయి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది…పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని కోరారు.ఈ నెల 24 న టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటిఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చన లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కృష్ణుడు విజ్ఞప్తి చేశారు.