సమంత ‘శాకుంతలం’లో అల్లు అర్హ‌..

23
Allu Arha

అల్లు’ ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఉనికిని చాటుకున్నారు. అల్లు రామలింగయ్య నిర్మించిన వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తే.. అల్లు అర్జున్ – అల్లు శిరీష్ ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నాల్గవ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అది ఎవరో కాదు అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.

అల్లు అర్జున్ త‌న‌య అర్హ‌ సోష‌ల్ మీడియా స్టార్‌. ఇప్పుడు త‌ను కూడా ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిలో ప‌డింది. అర్హ ప్ర‌ధాన పాత్ర‌లో దిల్ రాజు ఓ సినిమాని తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు… సమంత అక్కినేని ప్రధాన పాత్రలో గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న శాకుంత‌ల‌ంలోనూ అర్హ‌కి ఓ కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. ఈరోజు గురువారం అర్హ సెట్స్ లో జాయిన్ అయింది. అర్హ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది.