కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా వైసీపీ నేతలు ముద్రగడతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీ ముగిసిన తర్వాత ముద్రగడ ను వైసీపీలోకి ఆహ్వానించినట్లు ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముద్రగడ కూడా త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముద్రగడ వైసీపీలో చేరడం కన్ఫర్మ్ కావడంతో ఆయనను వైఎస్ జగన్ ఎవరిపై ప్రయోగించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ టార్గెట్ గా జగన్ ముద్రగడను బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. పవన్ ఈ సారి గెలుపు విషయంలో ధీమాగానే ఉన్నప్పటికి గత ఎన్నికల్లో ఎదురైన పరాభవం దృష్ట్యా ఎంతో కొంత బెరుకు ఉండే అవకాశం ఉంది. .
అందువల్ల ఈసారి అన్నీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని తను పోటీ చేయబోయే స్థానాన్ని పవన్ ఎంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే నియోజక వర్గంలోనే పవన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో పవన్ ఎక్కడ పోటీ చేసిన ఆయనకు పోటీగా ముద్రగడను దించేలా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమనేత కావడంతో ముద్రగడ కారణంగా ఓట్ల చీలిక జరిగి పవన్ ను ఓడించవచ్చనే ప్లాన్ లో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఏరికోరి ముద్రగడను జగన్ పార్టీలో చేర్చుకొనున్నారు. అయితే పవన్ పోటీ చేసే స్థానంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు టాక్. మరి ఎక్కడి నుంచి పోటీ చేసిన ఈసారి కూడా పవన్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదనే ప్లాన్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి టార్గెట్ పవన్ గా జగన్ వేస్తున్న ఎత్తుగడలు పవన్ ను ఎంతవరకు దెబ్బ తీస్తాయో చూడాలి.
Also Read:Harishrao:పాలమూరుకు శాపంగా కాంగ్రెస్