Harishrao:పాలమూరుకు శాపంగా కాంగ్రెస్

19
- Advertisement -

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీష్‌… పాలమూరు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన అని… రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలన్నారు.

పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలే.. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదు అన్నారు. మేము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం.. అలాంటి కేసీఆర్‌ను తిట్టడం అవివేకం.. తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. పేగులు మెడలో వేసుకొని రాక్షసులు తిరుగుతరు.. ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా.. మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దు అన్నారు.

నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతరు.. నేను అలా మాట్లాడి విలువ తగ్గించుకోను అని…కుసంస్కారంగా మాట్లాడటం వల్ల విలువ దిగజారుతుందన్నారు. భవిష్యత్‌లో రాజకీయాలకు వచ్చే వారికి స్ఫూర్తిగా మనం ఉండాలనే విలువలతో నేనుంటాను…ఎంత ఎత్తు ఉన్నమన్నది కాదు, ప్రజల కోసం ఎంత గట్టిక పని చేసినం అన్నది ముఖ్యం అన్నారు. కేసీఆర్ కిట్లు తెస్తే, రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నాడని..మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని బతుకులు బాగుపడ్డాయి.. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఎన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి చూస్తే కేసీఆర్ ఏం చేశారో రేవంత్ రెడ్డికి అర్థం అవుతుందని…పదేళ్లు చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు.. పాలమూరు వలసలు వాపస్ చేసింది కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదని…ఓట్లు సీట్లే కాదు నిజాయతీగా పని చేయాలని సూచించారు.

Also Read:ఒడిశాలో బీజేడీతో బీజేపీ!

- Advertisement -