న్యూయార్క్‌లో బొంతుకు వినూత్నంగా బర్త్ డే విషెస్‌

65
- Advertisement -

హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు బిఆర్ఎస్ యువనాయకులు ముదిరెడ్డి శ్రావణ్ గ్రాండ్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా లోని న్యూయార్క్ నగరంలో హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ గా పిలువ బడే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య కేంద్రం టైమ్ స్క్వేర్ లో 22 వేల చదరపు అడుగుల బారీ స్క్రీన్ పై ” హ్యాపీ బర్త్ డే బొంతు రామ్మోహన్ “అంటూ ప్రదర్శించారు. యువ నేతగా, ప్రజా నాయకుడిగా విశ్వనగరంగా హైదరాబాద్ మార్పులో తన పాత్ర పోషించారు అన్నారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్ అద్భుత కార్యక్రమం:ద్రౌపది ముర్ము

హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బ‌ర్త్ డే సంబురాలు ఘనంగా జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గంలో కేక్ కటింగ్ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించి, పేదలకు బట్టలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్మోహన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక వినూత్న రీతిలో‌ శుభాకాంక్షలు తెలిపి వారి అభిమానాన్ని చాటుకున్నారు బిఆర్ఎస్ యువనాయకులు ముదిరెడ్డి శ్రావణ్. గొప్ప నాయకుడి లక్షణాలు కలిగిన తమ నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also Read:గ్రీన్ టీ ఎక్కువగా తాగితే.. ప్రమాదమా?

- Advertisement -