మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మనా శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం అరుదైన బాక్సాఫీస్ రికార్డును సాధించింది. ఈ సినిమా 109 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి (షైన్ స్క్రీన్స్) మరియు సుశ్మితా కొనిదెల (గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్) నిర్మించారు.
ఈ చిత్రం వెడితెరపైనే కాదు ఓటీటీలోనూ సత్తాచాటింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇది చిరంజీవి, అనిల్ రవిపూడి కెరీర్‌లలో తొలి రూ.400 కోట్ల మైలురాయి. ఉత్తర అమెరికాలో దాదాపు 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. బుక్‌మైషోలో 3.8 మిలియన్ టికెట్లు విక్రయించబడటం కూడా విశేషం.
Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు
ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో నటించగా నయనతార ప్రధాన పాత్ర పోషించారు.

