వెస్టిండీస్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో స్టార్ భారత బ్యాటర్ సంజు శాంసన్ ఎలైట్ జాబితాలో చోటు సంపాదించాడు. కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో 52వ మ్యాచ్‌గా ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతాలో జరిగిన పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానికి శాంసన్ కీలక కారణమయ్యాడు.
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శాంసన్ 50 బంతుల్లో 97* పరుగులు చేసి జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌తో సంజూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్‌లను అధిగమించి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత ఆటగాళ్లలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ జాబితాలో 2010లో 101 పరుగులు చేసిన సురేష్ రైనా మాత్రమే శాంసన్ కంటే ముందున్నాడు.
మ్యాచ్ అనంతరం శాంసన్ మాట్లాడుతూ….ఈ ఇన్నింగ్స్ తనకు ప్రపంచం అంత విలువైనదని చెప్పారు. దేశం కోసం ఆడాలని కలగన్న రోజు నుంచి ఇలాంటి క్షణం కోసం ఎదురుచూశానని వెల్లడించారు. ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనా విశ్వాసం కోల్పోలేదని, ఈ రోజు దేవుడి కృపతో సాధ్యమైందని భావోద్వేగంగా పేర్కొన్నారు.
Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

