ఒక్క ఫోటోతో కూల్ చేసేశాడు..!

199
MS Dhoni's Picture With Sarfraz Ahmed's Son
MS Dhoni's Picture With Sarfraz Ahmed's Son
- Advertisement -

దేశంలోని మీడియా దృష్టంతా భారత్‌-పాకిస్తాన్ ఫైనల్ పైనే ఉంది.. ప్రత్యేక కథనాలు.. డిస్కషన్లు ప్రసారం చేస్తున్నాయి ఛానల్లు. పాక్ తో మ్యాచ్ భారత్ గెలవాల్సిందేనని అభిమానులు గొంతు చించుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్ గంగూళీ కారు అడ్డుకొని నానా హంగామా చేశారు. దీంతో టీమిండియా వీరాభిమానులంతా బారత్ గెలవాలని ఆవేశంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాక్, భారత్ క్రికెట్ అభిమానులకు ఒక ఫోటోతో చక్కని సందేశం పంపాడు. ఈ ఫోటోలో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ కుమారుడు అబ్దుల్లాను ధోనీ ఎత్తుకున్నాడు. కొద్దిసేపు అబ్దుల్లాను ఆడించాడట.

ఈ ఒక్క ఫోటోతో అటు పాక్‌ అభిమానులను, ఇటు భారత్‌ అభిమానులను కూల్ చేసేశాడు మిస్టర్‌ కూల్. వివాదాలు, విభేదాలు దేశాల మధ్య కానీ మనుషుల మధ్య కాదని ఈ ఒక్క ఫోటోతో నిరూపించాడని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. మైదానంలో శత్రువులు, మైదానం వెలుపల స్నేహితులని కొందరు.. ప్రపంచ ఉత్తమ కెప్టెన్‌తో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ కుమారుడు అబ్దుల్లా.. అందుకే ధోనీకి పాకిస్తాన్‌ ఫ్యాన్న్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dhoni

- Advertisement -