విజయ్‌ ‘బీస్ట్’ షూటింగ్‌లో ధోనీ సందడి.. పిక్స్ వైరల్

195

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌ని కలిశారు. ధోనీ ఇటీవల చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా హీరో విజయ్‌ను కలిసిశారు. విజయ్‌ ప్రస్తుతం నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని గోకుల్ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో షూటింగ్ లోకేషన్‌కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.