ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించిన ధోనీ..

236
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్,చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఎమ్మెస్ ధోనీ ఐపీఎల్‌లో అరుదైన రికార్డును నమోదు చేశాడు.. టీ20 క్రికెట్‌లో ధోనీ 6వేలకు పైగా పరుగులు సాధించడం. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడు ధోనీ. ఐపీఎల్‌లో భాగంగా దిల్లీ డేర్‌డెవిల్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఘనతను అందుకున్నాడు.

MS Dhoni Becomes Fifth Indian To Score 6000 Runs In T20s

ఈ మ్యాచ్‌కు ముందు ధోనీ 6వేల పరుగుల క్లబ్‌కు 10 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ 17 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బౌల్ట్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి ధోనీ వెనుదిరిగాడు. దీంతో అతడు టీ20 క్రికెట్‌లో 6వేలకు పరుగులు సాధించినట్లైంది.

ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడు ధోనీ. సురేశ్‌ రైనా(7,708), విరాట్‌ కోహ్లీ (7,621), రోహిత్‌ శర్మ(7,303), గౌతమ్‌ గంభీర్‌(6,402)… ధోనీ కంటే ముందున్నారు. ధోనీకి ఇది 290వ టీ20 మ్యాచ్‌. ఐపీఎల్‌లో 4వేల పరుగుల క్లబ్‌కు ధోనీ చేరువయ్యాడు. ఇప్పటి వరకు ధోనీ ఐపీఎల్‌లో సాధించిన పరుగులు 3,974. మరో 26 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్‌లో 4వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ కూడా చేరతాడు.

- Advertisement -