డైట్ సీక్రెట్ చెప్పిన మృణాల్ ఠాకూర్

17
- Advertisement -

మృణాల్ ఠాకూర్.. అప్పుడెప్పుడో 10 ఏళ్ల కిందటొచ్చిన ‘విట్టి దండు’ అనే మరాఠీ సినిమాలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆమె ఫిజిక్ లో కిలో మార్పు కూడా రాలేదు. అలా అని మృణాల్ ఠాకూర్ ఫుల్లుగా డైటింగ్ చేస్తుందనుకుంటే పొరపాటు. “డైటింగ్ పేరిట కడుపు మాడ్చుకోవడం నాకిష్టం ఉండదు. స్వీట్స్, చాక్లెట్స్ తింటాను’ అంటూ మృణాల్ ఠాకూర్ తన సంగతులు చెబుతుంది. కాకపోతే అన్నీ లిమిట్ గా తింటాను. నాకు ప్రత్యేకంగా న్యూట్రిషనిస్ట్ కూడా ఎవ్వరూ లేరు. ఇంట్లో వండిన ఆహారమే తింటాను. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తాను. మనం ఎంత తినాలనేది బాడీ మనకు చెబుతుంది అంటుంది ఈ సీతారామం బ్యూటీ.

‘మృణాల్ ఠాకూర్’ ఇంకా మాట్లాడుతూ.. ‘మన మనసును ఫాలో అయితే చాలు. ఏదైనా తినొచ్చు. నేను రెగ్యులర్ గా బట్టర్ చికెన్, దాల్ మఖ్నీ, చికెన్ బిర్యానీ, చాక్లెట్ తింటాను. బయట ఫుడ్ విషయానికొస్తే ఇటాలియన్ రుచులంటే ఇష్టం’ ఇలా తను ఎలాంటి డైట్ ఫాలో అవ్వననే విషయాన్ని బయటపెట్టింది మృణాల్ ఠాకూర్. అన్ని రుచులు ట్రై చేయాలని అనుకుంటానని, కాకపోతే లిమిట్ లో ఉంటానని చెబుతోంది. ఏ రోజైనా కాస్త అదనంగా తిన్నట్టు అనిపిస్తే, వెంటనే తన జిమ్ ట్రైనర్ కు చెబుతానని, మిగతా విషయాలన్నీ అతడే చూసుకుంటాడని మృణాల్ ఠాకూర్ చెబుతోంది.

ఐతే, లస్ట్ స్టోరీస్ 2 లో మృణాల్ ఠాకూర్ బోల్డ్ సీన్స్ చేయడం ఆ మధ్య హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయం పై కూడా మృణాల్ ఠాకూర్ స్పందించింది. ఆ సీన్స్ చేయడానికి నేను ఏ మాత్రం ఆలోచించలేదు. కాకపోతే ఆ సీన్స్ చేయడానికి నేను నా ఫిజిక్ ను మార్చుకున్నాను. అందుకోసమే రోజూ పొద్దున్నే వేడి నీళ్లలో కాస్త నిమ్మకాయ రసం, తేనె వేసుకొని తాగాను. ఆ వెంటనే జిమ్ కు వెళ్లేదాన్ని. పైగా ఇంట్లో వండిన టిఫిన్ మాత్రమే చేశాను’ అలా నెల రోజుల పాటు చాలా కంట్రోల్ లో ఉండి, ఆ సీన్స్ చేశాను అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.

Also Read:ఏపీ ఎన్నికల ప్రచారంలో కొండా!

- Advertisement -