ఎన్టీఆర్ తో సినిమా చేయాల‌నుందిః వెంకీ అట్లూరి

290
Venky-Atluri ntr
- Advertisement -

మొద‌ట న‌టుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ద‌ర్శ‌కుడిగా స్ధిర‌ప‌డిపోయారు వెంకీ అట్లూరి. మొద‌టి సినిమానే వ‌రుణ్ తేజ్ తో తొలిప్రేమ తో భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. ఆ త‌ర్వాత అఖిల్ అక్కినేనితో మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాతో మ‌రో హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ల‌వ్ స్టోరీలో తెరకెక్కించ‌డంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఏర్ప‌ర‌చుకున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్యూలో పాల్గోన్న వెంకీ అట్లూరి ప‌లు ఆసక్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

Mr.-Majnu

అఖిల్ తో సినిమా రెండు సంవ‌త్సరాల క్రింద‌టే చేయాల్సి ఉండేద‌ని కానీ అత‌డు రెండు సినిమాల‌కు క‌మిట్ మెంట్ ఇవ్వ‌డంతో ఈచిత్రం ఆల‌స్యమైంద‌ని చెప్పారు. అంత‌లోపు నేను వ‌రుణ్ తేజ్ తో తొలి ప్రేమ చిత్రాన్ని తెర‌కెక్కించాన‌ని తెలిపారు. ఈ కథని ముందు దిల్‌రాజుకి చెప్పా. ఆయన కాస్త అనుభవం వచ్చాక తీస్తే బాగుంటుందని చెప్పారు. కథ పరంగా కొన్ని సలహాలూ ఇచ్చార‌న్నారు. నేను మొద‌ట న‌ట‌న నుంచే నా కెరీర్ ను ప్రారంభించా కానీ నాకు న‌ట‌న‌లో సంతృప్తి ఉండేది కాదు.

Tholiprema

రెండో టేక్ చేయాలి అంటే చిరాకు వ‌చ్చేద‌న్నారు. అదే రచయితగా ఒక సన్నివేశం కోసం ఎన్ని వెర్షన్లు రాయాలన్నా ఇబ్బందిగా అనిపించదు. రచయితగా మొదలై దర్శకుడిగా మారా. త్రివిక్రమ్‌ స్ఫూర్తితో రచనని మొదలుపెట్టా. తివిక్రమ్‌ తర్వాత మణిరత్నం ఇష్టం. ఎన్టీఆర్ తో సినిమా చేయాల‌నుంది. కానీ అంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేయాలంటే ఇంకొంచెం అనుభ‌వం కావాలి అని చెప్పారు. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా ఎన్టీఆర్ తో సినిమా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి.

- Advertisement -