మిస్టర్ అంధకార్ రాజ్‌:వివేక్‌

45
- Advertisement -

సినిమా ఏదైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తే సూపర్ హిట్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో సినిమాలపై సినిమా నటులే కామెంట్‌ చేసుకుంటున్నారు.  తాజాగా కేరళలో నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లేటర్స్ ఇన్‌ కేరళ కార్యక్రమంలో ది కాశ్మీర్ ఫైల్స్ పై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. అదొక చెత్త సినిమా అని దాన్ని ఎవరు నిర్మించారో మాకు తెలుసు.

ఇంటర్‌నేషనల్ జ్యూరీ కూడా ఈ సినిమాను కనీసం పట్టించుకోలేదు. ఇంత జరిగినా వాళ్లకు సిగ్గు రాలేదు. ఆ చిత్ర దర్శకుడు ఇప్పటికీ నాకు ఎందుకు ఆస్కార్‌ రాలేదు?అని మాట్లాడుతున్నాడు. అతడికి ఆస్కార్‌ కాదు కదా… భాస్కర్ అవార్డు కూడా రాదని అన్నారు. ఇలాంటి సినిమాలు ప్రచారం కోసమే తీస్తారు అని కొంతమంది రూ.2000కోట్ల పెట్టుబడి పెడుతున్నారని నాకు తెలిసిన వాళ్లు చెప్పారు.

అయితే ఈ వ్యాఖ్యలపై ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రకాశ్‌రాజ్‌ కాదని అంధకార్ రాజ్‌అంటూ తీవ్రంగా స్పందించారు. అంతేకాదు అతన్ను అర్బన్ నక్సల్‌ అంటూ విమర్శించారు. ది కశ్మీర్ ఫైల్స్ అనే కచిన్న సినిమా కొందరు అర్బన్ నక్సల్స్‌ను రాత్రిపూట కూడా నిద్రపోనీయడం లేదని..యేడాది అయినా కూడా ఆ సినిమా వాళ్లు మర్చిపోలేకపోతున్నారు. అవన్నీ మొరిగే కుక్కలు మిస్టర్‌ అంధకార్‌రాజ్‌ భాస్కర్‌ అవార్డులన్నీ మీకే వస్తుంటే ఇక మాకు అవకాశం ఎక్కడ ఉంటుంది. అంటూ ఘాటుగా స్పందించారు.

కశ్మీర్‌ పండిట్‌లపై 1990ల దశకంలో జరిగిన యదార్థా సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. గతేడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌ నిలిచింది. ఈ సినిమాలో అనుపమ్‌ఖేర్ దర్శన్ కుమార్‌ మిథున్‌ చక్రవర్తి పల్లవిజోషీ తదితరులు కీలకపాత్రలో నటించారు.

ఇవి కూడా చదవండి..

ఆయనకు భాస్కర్‌ అవార్డు కూడా రాదు!

ఆమిర్‌పై సెటైర్‌ వేసిన కంగనా..

సురేష్ బాబు – రానా కేసు వెనుక కథేమిటి?

- Advertisement -