జూన్ 7న ఎంపీపీ..8న జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

281
Telangana CEO Rajat Kumar

రాష్ట్రంలో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెల్లడికానున్నాయి. ఇక ఎంపీపీ,జడ్పీ ఛైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు కాగా జూన్ 7వ తేదీన ఎంపీపీ,8వ తేదీన జడ్పీ ఛైర్మన్‌ ఎన్నిక జరుగుతుందని ఈసీ తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్‌ని విడుదల చేసింది.

జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కొత్తగా ఎంపికయ్యే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారానికి ముందే ఛైర్‌పర్సన్లను ఎన్నుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేస్తూ సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది.

వాస్తవానికి మే 27న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం తెలిసిందే.