బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరో తెలుసా..

349
jp nadda
- Advertisement -

మోడీ సర్కార్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమిత్ షా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీలో ఆయన పేరు ఎక్కువ ప్రచారంలో లేకపోయినప్పటికీ మంచి వ్యూహకర్తగా పేరుంది. యూపీలో ఎన్నికల బాధ్యతలను పర్యవేక్షించిన ఆయన 62 చోట్ల బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించారు.

పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా తప్పుకున్నప్పటికీ.. నడ్డా ఆయనతోనే కలిసి పనిచేయనున్నట్టు భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా సహా మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాన్ని నడ్డా పర్యవేక్షించనున్నారు.

అనంతరం చివర్లో జమ్మూ కశ్మీర్‌,ఢిల్లీలో ఎన్నికలు జరగనుండటంతో పార్టీ సారథ్య బాధ్యతలు నడ్డాకి అప్పజెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధ్యక్షపదవి కోసం దక్షిణాదికి చెందిన రాంమాధవ్ పేరు వినిపించినా బీజేపీ అధిష్టానం మాత్రం నడ్డా వైపు మొగ్గుచూపింది.

- Advertisement -