జూన్ 7న ఏపీ కేబినెట్ విస్తరణ..

270
YS Jaganmohan Reddy
- Advertisement -

ఏపీ మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారైంది.గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం జూన్ 7న మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నారు. అయితే ఎంతమందితో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే దానిపై వైసీపీ నేతలు క్లారిటీ ఇవ్వలేదు.

కేబినెట్ అమోదంతోనే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుభ్రమణ్యంతో అసెంబ్లీ అధికారులు చర్చలు జరిపారు. జూన్ 11,12 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కొత్త సభ్యలు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇప్పటికే శాసనసభ కార్యాలయానికి సమాచారం అందింది.

జూన్ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ఉండనుండటంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే శాఖల వారీగా అధికారులతో జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. జగన్‌ కోసం సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌ సీఎం కార్యాలయం సిద్ధమవుతోంది.

- Advertisement -