అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి- ఎంపీ

74
MP Venkatesh Netha

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేశ్ నేతకాని. శుక్రవారం పెద్దపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, కేసిఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేస్తుందని, రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎంపీ అన్నారు.

రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కల్పించే దిశగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మమతా రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, పెద్దపల్లి మార్కెట్ కమిటి చైర్మన్ శంకర్ నాయక్,వైస్ చైర్మన్ సురేందర్, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, మార్కెట్ కమిటి సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.