కొడితే మానేర్ డ్యంలో పడతావ్‌:బండిపై ఎర్రబెల్లి ఫైర్‌

68
Errabelli

కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బండి సంజయ్ కొత్త బిచ్చగాడని ఎద్దేవా చేసిన ఎర్రబెల్లి…నాలుగు సార్లు ఓడితే కరీంనగర్ ప్రజలు ఆయన్ని గెలిపించారని తెలిపారు.

బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన ఎర్రబెల్లి.. కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా ? అని ప్రశ్నించారు. బండికి ఇదే చివరి,ఆఖరి పదవి అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు కొడితే మానేరు డ్యాములో పడతవు అని హెచ్చరించిన ఎర్రబెల్లి..దమ్ముంటే కేంద్రం నుంచి నీళ్ల వాటా తీసుకురా అని సవాల్ విసిరారు.

మతమత్వం సెంటిమెంట్ తో దేశంలో గెలిచారని బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని అన్నారు. బీజేపీ మూర్ఖులు మత ఘర్షణలు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.