పార్టీ శ్రేణులకు మంత్రి దిశా నిర్దేశం..

45
Errabelli Dayakar Rao

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను, తాజా అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ కు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆదేశించారు.

అంతకుముందు రాయపర్తి మండలం కేంద్రంలోని చర్చిలో క్రిస్మస్ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు క్రిస్టియన్‌లకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే సంస్కృతిని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని మంత్రి చెప్పారు.