కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎంపీ సంతోష్..

203
mp santosh
- Advertisement -

ఈరోజు నిమ్స్ హాస్పిటల్‌లో తన సతీమణి రోహిణితో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా భయపడకూడదు అని ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్‌ వెంట నిమ్స్ డైరెక్టర్,డాక్టర్ గంగాధర్, డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -