చర్లపల్లి ఓపెన్ హెయిర్ జైలులో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్

240
mp santhu
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఈరోజు చెర్లపల్లి లోని సెంట్రల్ జైలు నందు ఖైదీలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ఖైదీలతో వారి యోగక్షేమాల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఖైదీలు వారికి ఉన్న సమస్యలను సంతోష్ గారి దృష్టికి తీసుకు పోవడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి తో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తానని సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మేయర్ బొంతు రాంమ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జైళ్లశాఖ ఐజి సైదయ్య,డిఐజి ఎంఆర్ భాస్కర్, పర్యవేక్షణ అధికారి డాక్టర్ దశరథరామిరెడ్డి,చర్లపల్లి జైల్ సూపర్ డెంట్ సంపత్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -