పర్లపల్లి గ్రామ సర్పంచ్‌ను అభినందించిన ఎంపీ సంతోష్‌..

147
mp santosh
- Advertisement -

పర్లపల్లి గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు వచ్చిన సందర్భంగా గ్రామ సర్పంచ్ మాదాడి భారతి నరసింహారెడ్డిని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందించారు. హరితహరం మరియు గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ్రామంలో చేపట్టిన మెక్కలపెంపకం గురించి అడిగి తెలుసుకున్నారు.

రోడ్డుకిరువైపుల, డివైడర్లలో మరియు పల్లె ప్రకృతివనంలో చెట్లు పూలమెక్కలు చాలా బాగున్నాయని సంతోష్‌ ప్రశంసించారు. గ్రామంలోసాధ్యమైనంత ఎక్కువ మెక్కలు పెంచే ప్రయత్నం చేయాలని సూచించారు. గ్రామాభివృద్దికి విశేషంగా కృషిచేస్తున్న టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యదర్శి మాదాడి రమేష్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు. గ్రామాభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎంపీ సంతోష్‌ తెలిపారు.

- Advertisement -