వనదేవతలను దర్శించుకున్న ఎంపీ సంతోష్‌ కుమార్

422
Mp Santhosh Kumar medaram
- Advertisement -

వన దేవతలు మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఉదయం సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీ సంతోష్ కుమార్ కూడా మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. తల్లులకు నిలువెత్తు బంగారంతో పాటు చీర,సారెలను సమర్పించి మొక్కలు చెల్లించారు.

సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సీతక్క,రాజయ్య,గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు. వనదేవతలంతా గద్దెలపైనే ఉండడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. దర్శనాల కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇవాళ, రేపు గద్దెలపైనే వనదేవతలు ఉంటారు. శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయనున్నారు అమ్మవార్లు.

- Advertisement -