నాగార్జున నాని ‘దేవ‌దాస్’ పోస్ట‌ర్ రిలీజ్…

304
devadas
- Advertisement -

కింగ్ నాగార్జున‌, న్యాచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్ లో ఓ మ‌ల్టిస్టార‌ర్ మూవీ తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈసినిమాకు యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటివ‌లే ఈసినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు చిత్ర‌బృందం. ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు చిత్ర‌యూనిట్.

nagarjuna, nani

ఈసినిమాలో నాని డాక్ట‌ర్ గా, నాగార్జున డాన్ గా క‌న‌పించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. టైటిల్ పొస్ట‌ర్ లో ముఖ్యంగా ఒక గ‌న్, ఒక సెత‌స్కొప్ తో కూడిన టైటిల్ లోగొను విడుద‌ల చేశారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న ఈసినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు అభిమానులు. ఈటైటిల్ విడుద‌ల చేయ‌డంతో అభిమానుల్లో సినిమాపై మ‌రింత ఆసక్తి పెరిగింది.

ప్ర‌స్తుతం ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా…త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ను క‌న్పామ్ చేయ‌నున్నారు చిత్ర‌బృందం. ప్ర‌ముఖ నిర్మాత అశ్వినిద‌త్ సినిమాను నిర్మించ‌గా..మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈమూవీలో హీరోయిన్లుగా ర‌ష్మీక మంద‌న‌, ఆకాంక్ష సింగ్ లు న‌టించారు. ఈసంద‌ర్భంగా న్యాచుర‌ల్ స్టార్ నాని త‌న ట్వీట్ట‌ర్ ఖాతాలో సినిమా టైటిల్ పోస్ట్ చేస్తూ దేవ మ‌రియు నేను అంటూ పోస్ట్ చేశాడు.

- Advertisement -