ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే గ్రీన్ ఛాలెంజ్‌: ఎంపీ సంతోష్

153
gic
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ములుగు (గజ్వేల్) అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ రావు, శంబీపూర్ రాజు తదితరులతో కలిసి మొక్కలు నాటారు ఎంపీ సంతోష్ కుమార్.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ రోజు రోజుకు మారుతున్న పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని అందరం కూడా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అందుకోసమే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి దాని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం జరుగుతుందని తెలిపారు.పర్యావరణం పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ కృషి చేస్తుంది అని అన్నారు.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం పాటుపడాలని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి యావత్ భారతదేశం మొత్తం పచ్చదనాన్ని పెంపొందించడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు అని వారు చేసిన కృషికి మీము అభినందిస్తున్నానని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చెట్ల పెంపకం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ప్రజాప్రతినిధులకు అధికారులకు అప్పజెప్పడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఫారెస్ట్ కళాశాల ,పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో అడవుల ప్రాముఖ్యత అడవుల వల్ల కలిగే లాభాల గురించి భవిష్యత్ తెలంగాణ విద్యార్థులకు వివరించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న వివిధ రకాల మొక్కలు వాటి నుండి ఉత్పత్తి అయిన ఔషధాలు, జరుగుతున్న పరిశోధనలు ఆసక్తిగా తిలకించడం జరిగింది. ఇదే సందర్భంగా తన జన్మదినం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు MLC నవీన్ రావు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కళాశాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -