10న నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్..!

125
kcr
- Advertisement -

ఈ నెల 10న నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, పోలీస్ కార్యాల‌ను ప్రారంభించ‌నున్నారు. సుమారు 30 ఎకరాలలో రూ.66 కోట్ల నిధులతో నిర్మాణ పనులు జ‌రుగగా ఇప్పటికే కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంతో పాటు అదనపు కలెక్టరేట్‌ల కార్యాలయాలు ప్రారంభించడం అక్కడ నుంచే కలెక్టర్‌ పాలన కొన‌సాగించ‌నున్నారు.

భవనాన్ని ప్రారంభించగానే కలెక్టరేట్‌ను ఆయా శాఖలను నూతన భవనంలోకి త‌ర‌లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రోవైపు..కలెక్టరేట్‌ భవన సమీపంలోనే నూతన పోలీసు భవన నిర్మాణాన్ని రూ.15 కోట్లతో వైట్‌ హౌజ్‌ను తలపించే విధంగా నిర్మించారు. అలాగే నిజమాబాద్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించే అవ‌కాశం ఉంద‌ని సమాచారం.

రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర్యం వచ్చిన త‌ర్వాత దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాయుధ పోరాటాన్ని విరమించిన గొప్ప ప్రజాస్వామిక వాది రావి నారాయ‌ణ‌రెడ్డి అన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి, దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారన్నారు.

- Advertisement -