ఆయిల్ ఫామ్‌ సాగుకు శ్రీకారం చుట్టిన మంత్రి హరీశ్‌ రావు

38
harishrao

సిద్దిపేట నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామ పరిధిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొదటి ఆయిల్ ఫామ్ మొక్కను మంత్రి హరీశ్ నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌…- రైతులు చినిగిన పంచెలు కాదు.. పట్టు పంచెలు కట్టుకునే రోజులను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని తెలిపారు.- తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల జీవితాలు బాగు పడతాయని., ఆనాడు కేసీఆర్ చెప్పిన మాట నేడు నైజమైందన్నారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణలోని భూ ఉపరితల సాగునీటి పరిమితి పెరిగిందన్నారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నే విధంగా తెలంగాణలో ధాన్యం పండిందని… ప్రతి ఏటా మన దేశంలో 90 వేల కోట్ల పామాయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అన్నారు. దీనిని నియంత్రించడంలో మన దేశం 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగు చేయాలన్నారు.

పామాయిల్ కు బహిరంగ మార్కెట్లో పుష్కలమైన డిమాండ్ ఉందని…. అందరూ రైతులకు గిట్టుబాటు ధర అందించేలా.. అన్నీ రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ వ్యవసాయంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని…. తెలంగాణ రైతులను ఒకనాడు నవ్విన ఆంధ్రా పాలకులు.., నేడు మనల్ని చూసి ఈర్ష్య పడుతున్నారని చెప్పారు. గతంలో మొగులుకు ముఖం పెట్టినా నీళ్లు వచ్చేవి కావు., కానీ నేడు సీఎం కేసీఆర్ ముఖం చూస్తే గలగలా గోదావరి జలాలు పారుతున్నాయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఏనాడైనా రైతుల గురించి పట్టించుకున్నారా.. సాగునీటి గురించి ఆలోచించారా అంటూ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.