కీసరలో జమ్మి మొక్కలు నాటిన ఎంపీ సంతోష్…

25
mp santhosh

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మంగళవారం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో జమ్మి మొక్కను నాటారు. తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న కీసర అభయారణ్యంలోని పెద్దమ్మ చెరువు పర్యాటక అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

అంతకుముందు శ్రీరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే వివేకానంద, జడ్పి చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.