ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసు..

35
kcr cm

సీఎం కేసీఆర్ తన పెద్ద మనసును చాటుకున్నారు. అరుదైన వ్యాధి చికిత్సకు రూ.25 లక్షలు మంజూరు చేశారు. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన శివాని పరిస్థితిని మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.

బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ తో ప్రాణాలు నిలిపే అవకాశం ఉండగా ఈ చికిత్సకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపగా క్యాబ్ డ్రైవర్ అయిన తండ్రి బాల్ రెడ్డి పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎంబీబీఎస్ లో సీటు వచ్చినా చదువుకోలేని పరిస్థితి ఉండగా శివాని (ఎల్ఓసీ) చికిత్సకు రూ.25 లక్షల ఎల్ఓసీ మంజూరు చేశారు.

20 ఏళ్ల క్రితమే బతుకుదెరువు కోసం వలసవెళ్లి హైదరాబాద్ పీర్జాదిగూడలో స్థిరపడింది శివాని కుటుంబం. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మాత్రమే ఉన్న ఈ అరుదయిన చికిత్సకు అవకాశం ఉండగా వనపర్తి లోని తన నివాసంలో రూ.25 లక్షల ఎల్ఓసీని శివాని తండ్రి బాల్ రెడ్డికి అందజేశారు నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి , మంత్రి నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు శివాని కుటుంబసభ్యులు.