నాటిన ప్రతీ మొక్కను సంరక్షిద్దాం : ఎంపీ సంతోష్

201
santhosh kumar
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి.సంతోష్ కుమార్ మరియు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నాగోల్ బ్రిడ్జి ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మరియు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..ప్రకృతిని ప్రేమించి,పరిరక్షిస్తూ మనుషులందరు ఏ రోగం లేకుండా జీవిస్తారు అని తెలిపారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ,తమ బాధ్యతగా తీసుకొవలని కోరారు.నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యన్నీ తగ్గించాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి అని తెలిపారు.

అలాగే ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలూ ఉన్నాయో గుర్తించి అట్టి స్థలాల్లో మొక్కలు నాటాలని తెలిపారు.అలాగే నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క కాలనీవాసులు తమ బాధ్యతగా విధిగా తమ తమ ఇంటి ముందు మొక్కలు మరియు ఇంకుడు గుంతలు ఎర్పాటు చేసుకోవాలని కోరారు.ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్ తరాలకు నీటి కొరత ఉందదు అని అన్నారు.ఇది ఒక సమజాసేవగా భావించి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.అలాగే అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా,విద్యాలయాల్లో,పోలీస్ స్టేషన్ నందు,మార్కెట్ యార్డులో,వ్యవసాయ క్షేత్రంలో,స్మశానవాటికలో,గ్రేవీ యార్డులో,పరిశ్రమలో,అన్ని ప్రభుత్వ కార్యాలయంలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.అలాగే ప్రభుత్వ రంగసంస్థలు అయిన అర్.టీ.సీ,విద్యుత్ శాఖలు,పాఠశాల విద్యార్థులు,స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు,డ్వాక్రా మహిళలు ఇట్టి కార్యక్రమంలో తమ వంతుగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కోరారు.

- Advertisement -