కోటి వృక్షార్చన…మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్

221
ktr gic

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.గద్వాల సమీపంలోని వీరాపురంలో మొక్కలను నాటి నీళ్లు పోశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్‌కుమార్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ అలుపెరుగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. బంగారు తెలంగాణ సాధనకు బాటలు వేస్తున్నారని కొనియాడారు.