మహా ఉద్యమంగా గ్రీన్ ఛాలెంజ్:ఎంపీ సంతోష్

36
- Advertisement -

మూడు మొక్కలతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇప్పుడు మహా ఉద్యమంగా మారిందన్నారు ఎంపీ సంతోష్ కుమార్. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కరీంనగర్‌లో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సంతోష్..ఈ మహత్తరమైన కార్యక్రమం ఐదేండ్లు పూర్తిచేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిందని చెప్పారు. కరీంనగర్ రాశి వనంలో మొక్కను నాటడం అదృష్టంగా భావిస్తున్నానని …ఈ ఐదేండ్ల కాలంలో లక్షలాది మొక్కలను నాటి, వాటిని సంరక్షించామన్నారు.

Also Read:చిక్కుల్లో మెగాహీరో సాయిధరమ్!

గ్రీన్ ఇండియా చాలెంజ్‌తో ఎంపీ సంతోష్ కుమార్ చిన్నారుల్లో కూడా స్ఫూర్తిని నింపుతున్నారన్నారు మంత్రి గంగుల. ఎంపీ సంతోష్ స్ఫూర్తితో ఎక్కడ ఖాళీ ప్రభుత్వ స్థలం కనిపించినా మొక్కలు నాటుతున్నామని.. వాటిని సంరక్షిస్తామని తెలిపారు. ఎల్ఎండీలోని ఎస్‌ఆర్‌ఎస్పీ స్థలం ఆక్రమణలకు గురికాకుండా పెద్ద ఎత్తున మొక్కలు నాటామని చెప్పారు.

Also Read:నాయకుడు’ గొప్ప ఆనందాన్నిచ్చింది: కీర్తి సురేష్

- Advertisement -