సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి మొక్కలునాటిన ఎంపీ సంతోష్..

158
santhosh

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అపూర్వ స్పందనవస్తోంది. మూడోదశ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నోవా హోటల్ దగ్గర హరితహరం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ సంతోష్. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి సంతోష్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్…దీని అభివృద్ధి కోసం రూ. 2 కోట్లు కేటాయించారు.

ఇక త్వరలో మరిన్ని అటవీ బ్లాకులను ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు దత్తత తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు ఎంపీ సంతోష్.