శ్రీహరికి ఎంపీ సంతోష్ హరిత కానుక

281
santhosh
- Advertisement -

మొక్కను నాటి తిరుపతి వెంకన్న మొక్కును తీర్చుకున్నారు..ఎంపీ జోగిన పల్లి సంతోష్ కుమార్.దైవాంశ సంభూతమైన ప్రకృతిని కోసం ఆ దేవ దేవుని సన్నిధిలోనూ పరితపిస్తున్నడు… అంతా శ్రీహరి మయం, ఈ జగమంతా హరితమయం.. అని ధ్యాన్నిస్తున్నడు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.

పదికాలాల పాటు పచ్చగా వుండాలని సల్లగా బతకాలని దీవించే ఏడుకొండల వాడు కలియుగ దైవం వెంకటేశ్వరుని సాన్నిధ్యంలో మొక్కకు జీవం పోసి ఈ విశ్వానికి దైవ చింతనతో పాటు ప్రకృతి చింతనను ప్రభోధిస్తున్నడు..హరిత రుషి..ఎంపీ సంతోష్ కుమార్.లోకాలనేలే శ్రీహరి దర్శనానంతరం హరితాన్నే ఆ స్వామి వారికి కానుకగా సమర్పించుకున్నారు.

పచ్చని మొక్కను నాటి తన మొక్కును తీర్చుకున్న సంతోష్… ఈ సందర్భంగా తిరుపతిలో తన సహచర మిత్రులు ఎమ్మెల్సీ నవీన్ రావు, పోచం పెల్లి శ్రీనివాస రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెన్నమనేని శ్రీనివాస రావు లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -