ఇది సీఎం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనం: ఎంపీ సంతోష్

51
santhosh kumar
- Advertisement -

నీళ్లు- నిధులు- నియామ‌కాల,నినాదాలు నిజ‌మయ్యాయి దేశం అబ్బుర‌ప‌డే స్థాయిలో ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క‌ట‌న వ‌చ్చింది ఇది గౌరవ కేసీఆర్ కార్య‌ద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌నం అన్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్“నీళ్లు-నిధులు-నియమకాలు” అనే ప్రధాన మంత్రంతో ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ట్రం సాధించారని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడేండ్ల కాలంలో ఇప్పటికే అనేక నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి తద్వారా గొప్ప సంపదను సృష్టిస్తున్నారని అన్నారు.

ఇప్పటికే ఇచ్చిన 1 లక్షకు పైగా ఉద్యోగాలు కాకుండా, ఇప్పుడు మరో 91,142 పోస్టుల నోటిఫికేషన్‌ను ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ నుండి మరో బహుమతి వచ్చిందని “నీళ్లు- నిదులు- నియామ‌కాల,నినాదాలు నిజ‌మయ్యాయని దేశం అబ్బుర‌ప‌డే స్థాయిలో ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క‌ట‌న వ‌చ్చిందని అన్నారు.ఇది గౌరవ కేసీఆర్ గారి కార్య‌ద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌నమని తెలంగాణ యువ‌త‌కు ఎంపీ సంతోష్ కుమార్ శుభాకాంక్ష‌లు తెలిపారు.ఇది ఉద్యోగ నామ సంవ‌త్స‌రంగా అభివర్ణిస్తూ తెలంగాణ యువ‌త‌కు ఎంపీ సంతోష్ కుమార్ శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

- Advertisement -